Header Banner

మరో ఎన్నికల హామీ అమలు - వారి ఖాతాల్లో నిధుల జమ! బుడగట్లపాలెం గ్రామంలో చంద్రబాబు పర్యటన..

  Sat Apr 26, 2025 20:13        Politics

ఏపీలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎక్స్ లో స్పందించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మత్స్యకారులకు వేట విరామ కాలంలో అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో రూ.10 వేలుగా ఉన్న ఈ సహాయాన్ని రూ. 20 వేలకు పెంచామని, ఈ పథకం కింద నేడు 1,29,178 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 258.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. వేట నిషేధ సమయంలో ఆదాయం లేక మత్స్యకారులు పడే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొనే ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారికి అండగా నిలవడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ పథకం ప్రారంభం సందర్భంగా తాను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అక్కడ మత్స్యకార సోదరులతో నేరుగా మాట్లాడి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నానని వివరించారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలా మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆ కష్టజీవులతో గడిపిన సమయం, రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేయాలనే తన సంకల్పాన్ని మరింత దృఢపరిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

నేడు (26/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations